డీసీఎం బోల్తా.. డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

డీసీఎం బోల్తా.. డ్రైవర్‌ మృతి

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : డీసీఎం బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారులోని సాలార్‌ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాత ఇనుప సామాను దుకాణం నుంచి సామగ్రిని డీసీఎంలో హైదరాబాద్‌ తరలిస్తున్నారు. వాహనం జిల్లా కేంద్రం శివారులోని సాలార్‌ తండా మీదుగా వెళ్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చింది. దీంతో ఆటోను తప్పించబోయి డీసీఎం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లగొండ లాలయ్య (35)గా గుర్తించారు. ఘటనాస్థలిని టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని 108లో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఫ మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా వాసి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement