దారికాస్తున్న మృతు్యవు | - | Sakshi
Sakshi News home page

దారికాస్తున్న మృతు్యవు

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

పెద్దవూర : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారి ప్రతిరోజు వందలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని పోతునూరు టోల్‌గేట్‌ నుంచి నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీలోని కృష్ణా నదిపై నిర్మించిన వంతెన వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ రహదారిపై గతంలోనూ, ఇటీవల ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదాలకు కారణాలు..

● నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారితో పాటు కొండమల్లేపల్లి నుంచి పెద్దవూర వరకు 26 కిలోమీటర్ల మేర జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారి కలిసి ఉన్నాయి. దీంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.

● ముఖ్యంగా పొట్టిచెల్మ నుంచి నాగార్జునసాగర్‌ పైలాన్‌కాలనీ వరకు నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారి, నకిరేకల్‌–అద్దంకి జాతీయ రహదారులు కలిసి ఉంటాయి. ఇక్కడ ప్రమాదకరమైన యూ ఆకారపు మూలమలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మూడు ప్రదేశాలలో ఘాట్‌ రోడ్డు ఉంది. దయ్యాలగండి, శివం హోటల్‌ వద్ద ఘాట్‌ రోడ్లు ఉన్నాయి. విజయ్‌ విహార్‌ నుంచి పైలాన్‌ కాలనీ శ్మశానవాటిక వరకు నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా డౌన్‌లో ఉంటుంది.

● ముత్యాలమ్మ గుడి వద్ద ప్రమాదకరమైన యూ ఆకారంలో రోడ్డు ఉంది. ఈ ప్రదేశంలో వాహనాలు వేగాన్ని నియంత్రించుకోలేక అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

● రోడ్డు మధ్యలో డివైడర్‌ లేకపోవడం, మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, రహదారి చాలా ప్రదేశాల్లో ఎగుడుదిగుడు(అప్‌ అండ్‌ డౌన్‌)గా ఉండటం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఫ హైదరాబాద్‌–సాగర్‌ రహదారిపై ప్రమాదకరంగా ఆ 35 కిలోమీటర్లు

ఫ మూలమలుపుల వద్ద వేగాన్ని

నియంత్రించలేక ప్రమాదాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement