కనుల పండువగా ఎల్లమ్మ కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా ఎల్లమ్మ కల్యాణం

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

కనగల్‌ : మండలంలోని దర్వేశిపురం(పర్వతగిరి) రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. రేణుకా ఎల్లమ్మ తల్లి, జమదగ్ని మహాముని ఉత్సవ విగ్రహలను పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకురాగా.. బ్రహ్మశ్రీ డేరం భాస్కరశర్మ, ఆలయ అర్చకులు, వేద పండితుల బృందం కల్యాణం నిర్వహించారు. భక్తులు ఒడిబియ్యం, కట్న కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి..

అమ్మవారికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వం తరఫున ఆలయ చైర్మన్‌ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబాటి నాగిరెడ్డితో కలిసి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కల్యాణం అనంతరం మంత్రికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

జన సంద్రంగా ఆలయ పరిసరాలు..

కల్యాణాన్ని తిలకించేందుకు నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, లలితా సహస్రనామార్చన, బాలభోగ నివేదన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం చేశారు. సీఐ రాము ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూకురి రమేష్‌, తహసీల్దార్‌ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, సర్పంచులు రాయల శేఖర్‌, నేలగొందరాశి ముత్తయ్య కాంగ్రెస్‌ నాయకులు గుమ్ముల మెహన్‌రెడ్డి, నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, గోలి జగాల్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కూసుకుంట్ల రాజిరెడ్డి, గోలి నర్సిరెడ్డి, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, ఆలయ సిబ్బంది శ్రీనివాసచారి, ఫణి, అజయ్‌కుమార్‌, నాగరాజు, నాగేశ్వర్‌రావు, కూసం ఉపేందర్‌రెడ్డి, అంజనేయులు, రాజయ్య, శ్రీకర్‌, నాగరాజు, రవి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

నేడు బోనాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 4గంటలకు బోనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు ఏకాంత సేవ తదితర కార్యక్రమాల అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి.

ఫ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement