● ఈ నెల 19న అర్థరాత్రి పెద్దవూర మండలంలోని రామన్నగూడెం గ్రామ స్టేజీ సమీపంలో రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు.
● ఈ నెల 17న పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ స్టేజీ సమీపంలో టోల్‌గేట్ వద్ద బైక్‌ను కారు ఢీకొట్టడంతో బైక్‌ను నడుపుతున్న దేవరకొండ పట్టణానికి చెందిన గొడుగు సతీష్ మృతి చెందాడు.
● మార్చి 17వ తేదీన పెద్దవూర మండల కేంద్రంలోని పత్తి మిల్లులో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన రామ్‌రేఎంబర్రం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
● పొట్టిచెల్మ సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలోని దయ్యాలగండి వద్ద మూలమలుపుతో పాటు ఘాట్ రోడ్డు ఉండటంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతంలో మూడేళ్ల క్రితం గడ్డి ట్రాక్టర్ రోడ్డుపై అడ్డంగా బోల్తా పడటంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. లారీ అదుపుతప్పి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో పలువురు మృత్యువాత పడ్డారు.
● గతంలో ఓ ప్రైవేట్ బస్సు సైతం అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు మృతిచెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.


