దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టు

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

పాలకుర్తిటౌన్‌(దేవరుప్పుల) : అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్‌ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సృజన్‌కుమార్‌ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్‌ రసూల్‌, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన చింత సుదర్శన్‌, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్‌ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి దొంగ నోట్లు, ప్రింటర్‌, కారు, రూ.8500 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు. ఆ నలుగురిని బుధవారం జనగామ జైలుకు తరలించారు.

కారు, ప్రింటర్‌, ఇతర సామగ్రి స్వాధీనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement