రెండెకరాలు దాటేనా.. | - | Sakshi
Sakshi News home page

రెండెకరాలు దాటేనా..

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

యాసంగి సీజన్‌లో

రూ. 192.60 కోట్లు జమ

భువనగిరి: రైతు భరోసా పథకం కింద ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజుల పాటు పంటల సాగు పెట్టుబడికి ఆర్థిక సహాయం విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై జిలా్‌ల్‌ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యాసంగి సీజన్‌లో ఈ పథకం కింద సాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని రైతులకు ఎవరికి ఎంత భూమి ఉన్నా ఎకరాకు రూ. 6వేల చొప్పున రెండు ఎకరాల వరకు మాత్రమే రెండు విడుతల్లో ఆర్థిక సాయం అందించారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు సంతోషించినా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి గతంలో మాదిరిగా ఆర్థిక సహాయం అందక నిరాశకుగురయ్యారు.

తొమ్మిది రోజుల పాటు

రాష్ట్రంలో 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు పేరుతో పథకాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 5వేల చొప్పున అందించింది. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ సంవత్సరం యాసంగి సీజన్‌లో ఎకరానికి రూ. 5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 2024 వానాకాలం సీజన్‌లో రైతు బంధు కింద ఆర్థిక సహాయం చేయలేదు. అనంతరం రైతు భరోసా పథకంగా పేరు మార్చి 2024–25లో యాసంగిలో ఎకరానికి రూ. 6వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. ఈ సీజన్‌లో జిల్లాలోని 1,88,526 మంది రైతులకు రూ. 174.11 కోట్లు ఆర్థిక సహాయం అందించింది. ఆ తర్వాత 2025లో వానాకాలం సీజన్‌లో 2,33,418 మంది రైతులకు రూ. 36.47.కోట్ల ఆర్థిక సహాయం కింద రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది.

2025–26 యాసంగి సీజన్‌లో ఎకరానికి రూ. 6వేల చొప్పున కేవలం రెండు ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అందించింది. దీనిప్రకారం జిల్లాలో 211285మంది రైతులకు రూ. 192.60కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. ఇంకా చాలా మంది రైతులకు రెండు ఎకరాల పైబడిన వారికి అందలేదు. ఈసారి వానాకాలం సీజన్‌లో అందరికీ మొత్తం విస్తీర్ణణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అనే సందేహం రైతుల్లో కలుగుతోంది. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో జరిగే రైతు సమ్మేళనంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోఆ రోజు నుంచి రైతుల ఖాతాలో పెట్టుబడి సహాయం జమకానుంది.

ఫ 30 నుంచి రైతు భరోసా విడుదల చేస్తామన్న సీఎం

ఫ రైతుల ఎదురుచూపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement