‘ప్రగతి ప్రణాళిక ’ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి ప్రణాళిక ’ సమస్యలు పరిష్కరించాలి

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

సాక్షి, యాదాద్రి : జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెనహర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. జిల్లాలో ఫైళ్ల క్లియరెన్స్‌, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్య సేవలు, అరైవ్‌ అలైవ్‌, వ్యవసాయం, విద్యా, సంక్షేమం, మహిళా వారోత్సవాలు, యువజన, క్రీడలు, పశు సంవర్ధక , అటవీ, మత్స్య శాఖల కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా బెనహర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను పరిశీలించేందుకు వెంటనే కార్యాచరణ ప్రారంభించాలన్నారు. ప్రమాదాల నివారణకు, డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెలా ఇలా సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకా రెడ్డి , సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెనహర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా

ఫ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement