అక్టోబర్‌ నాటికి ఖిలాపై రోప్‌వే | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ నాటికి ఖిలాపై రోప్‌వే

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 7:43 AM

భువనగిరి: రోప్‌ వే పనులను అక్టోబర్‌నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. భువనగిరి ఖిలాపై ప్రస్తుతం రూ.65కోట్లతో కొనసాగుతున్న రోప్‌వే నిర్మాణ పనులను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి సోమవారం జూపల్లి పరిశీలించారు. దీనిపై అధికారులతో సమీక్షించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోప్‌ వే పనుల నిర్వహణలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పర్యాటక శాఖ ఎం.డీ. గౌతమి పూజారి, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవెజ్‌ చిస్తీ పాల్గొన్నారు.

స్మార్ట్‌ టెంపుల్‌గా సోమేశ్వరాలయం

ఆలేరురూరల్‌: కొలనుపాకలోని సోమేశ్వరాలయాన్ని స్మార్ట్‌ టెంపుల్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాకలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అడిషన కలెక్టర్‌ భాస్కర్‌రావుతో కలిసి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్మార్ట్‌ టెంపుల్‌గా చేసే విషయంలో త్వరలో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఈ ఆలయానికి త్వరలో రూ.5కోట్లు మంజూరు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పాత దేవాలయాలను తొలగించి వాటిని అన్ని హంగులతో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఆలయం వెనకాల పిన్న చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చి బోటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాత్‌రూమ్‌ల సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరో సారి సోమేశ్వరాలయానికి వస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, ఆర్కియాలజీ డైరెక్టర్‌ అర్జున్‌రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ బెదరబోయిన యాకమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఐనాల చైతన్య, గందమల్ల అశోక్‌, ఉపసర్పంచ్‌ గొట్ట జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ఫ భువనగిరి ఖిలాపై రోప్‌వే పనుల పరిశీలన

ఫ అధికారులతో సమీక్ష

ఫ పనుల జాప్యంపై ఆగ్రహం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement