కొలనుపాకకు పర్యాటక హంగులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కొలనుపాకకు పర్యాటక హంగులు కల్పించాలి

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 7:43 AM

ఆలేరురూరల్‌: కళ్యాణ చాళుక్యుల కాలంనాటి అద్భుతమైన శైవ క్షేత్రం, చరిత్ర కలిగిన కొనుపాకకు పర్యాటక హంగులు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి కోరారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొలనుపాకలో సోమేశ్వర, జైన మందిర్‌ వంటి చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. చాళుక్యుల కాలంలో నిర్మితమైన సోమేశ్వరాలయం రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో కొలనుపాక ఆలయ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని, మ్యూజియం ఏర్పాటు, దేవాలయం పరిసర అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. పిన్న చెరువు కట్ట విస్తరణ, రెయిలింగ్‌, సుందరీకరణ పనులు చేపట్టాలని కోరారు. యాదాద్రి పర్యాటక సర్క్యూట్‌లో భాగంగా చేర్చి ప్రత్యేక నిధులు కేటాయిస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈసమావేశంలో మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌, సర్పంచ్‌ బెదరబోయిన యాకమ్మ, మాజీ సర్పంచ్‌ ఆరుట్ల లక్ష్మీ ఛప్రసాద్‌రెడ్డి, జంగ స్వామి, మాజీ ఎంపీపీ అనసూయ, సీఎచ్‌.సురేందర్‌రెడ్డి, నంద మహేందర్‌, కుమ్మరిండ్ల ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement