భువనగిరిటౌన్ : ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్,వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాయ కృష్ణ, రామచందర్, ఎల్లయ్య, రవి, కొండయ్య, బిక్షపతి, లక్ష్మమ్మ, లింగమ్మ, శోభ, రోజా, శ్యామల, యాదమ్మ, వరమ్మ పాల్గొన్నారు.


