ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 7:43 AM

సాక్షి, యాదాద్రి, భువనగిరి: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. సోమవారం భువనగిరి పట్టణంలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు విరివిగా ఉపయోగించి పంటలు పండిస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. పాత కాలపు పద్ధతిలో వ్యవసాయం చేయాలని కోరారు. రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి, దాసరి మల్లేశం, పాశం భాస్కర్‌, ధనుంజయ్య, పీఎస్‌ రవీందర్‌, తుమ్మల మురళీధర్‌రెడ్డి, మాయ దశరథ, మహేందర్‌ గుప్తా, శ్రీనివాస్‌, కోటేష్‌, వైజయంతి, శ్రీనివాస్‌, మల్లారెడ్డి, బలరాం పాల్గొన్నారు.

ఫ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement