సంస్థాన్ నారాయణపురం : సీపీఐని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంకు వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుడాలన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతు, కార్మిక సమస్యలపై పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు సీపీఐ జిల్లా నాయకులు పల్లె సరళ, శేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పల్లె సరళ తండ్రి, శేఖర్‌రెడ్డి మామ చిట్యాల సత్తిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగొని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా సమితి సభ్యుడు కలకొండ సంజీవ, కొండూరు విప్లవ్, శనిగల నరేష్, బద్దుల సుధాకర్, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి బద్దుల పెంటయ్య, పల్లె సత్తిరెడ్డి, పల్లె గోపాల్ రెడ్డి తదితరలున్నారు,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు


