అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ముసిగంపల వెంకన్న ఇంటి సమీపంలో శనివారం రాత్రి పిడుగుపడి అతడి ఇంటి స్లాబ్ ధ్వంసమైంది. ఇంట్లోని విద్యుత్ మీటర్ వైర్లు కాలిపోయాయి. ఇంట్లో నిద్రిస్తున్న వెంకన్నతో పాటు అతడి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా
వినూత్నంగా అవగాహన
సూర్యాపేటటౌన్ : ఫాదర్స్ డేను పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ‘పితృవేదన’ పేరుతో డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా వినూత్నంగా అవగాహన కల్పించారు. ఫ్లెక్సీ, కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మైక్ సెట్ ద్వారా సందేశాలను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో మాదకద్రవ్యాలు, గంజాయి, ఆనన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారని అన్నారు. యువత చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న
వాహనాలు సీజ్
భువనగిరి : పట్టణంలోని భువనగిరి–నల్లగొండ రోడ్డు మార్గంలో ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 7 వాహనాలను సీజ్ చేసినట్లు డీటీఓ నరేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత రెండురోజులుగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్: హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. ఓ వైపు జాతీయ రహదారి విస్తరణ, మరమ్మతు పనులు జరుగుతుండటం మరోవైపు వీకెండ్ కూడా తోడవ్వడంతో రద్దీ పెరిగింది. చౌటుప్పల్, ధర్మోజిగూడెం, తూప్రాన్‌పేట వద్ద హైవేకు ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు బారులుదీరాయి.
బెల్లం పానకం ధ్వంసం
తుంగతుర్తి : మండలంలోని రాజన్నతండా, అన్నారంతో పాటు జాజిరెడ్డిగూడెం మండలంలోని మేడిబాయితండా, మర్రిబాయితండా, కొమ్మాల గ్రామాల్లో ఆదివాంర సారా తయారుచేస్తున్న గృహాలపై దాడులు నిర్వహించి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎస్‌ఐ మూర్తి తెలిపారు. అదేవిధంగా 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు స్వర్ణలత, శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు.


