యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ

Jun 22 2026 7:09 AM | Updated on Jun 22 2026 7:09 AM

యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఉదయం 6గంటల నుంచి వర్షం కారణంగా బ్రేక్‌ దర్శనం సమయం వరకు భక్తులు సాధారణంగానే కనిపించినప్పటికీ.. ఉదయం 11గంటల తర్వాత భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, మాడ వీధులు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌, బస్టాండ్‌, ప్రసాద విక్రయశాల, శివాలయం వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. స్వామివారిని 50వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యాదాయం రూ.56,59,882 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.

50వేల మందికి పైగానే

దర్శించుకున్న భక్తులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement