కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నల్లబెల్లం, పటిక లభ్యమైంది. ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టగా హైదరాబాద్–ఆమనగల్లు మార్గంలో ప్రయాణిస్తున్న ఓ బొలెరో వాహనంలో 1,200 కేజీల నల్లబెల్లం, 50 కిలోల పటిక లభ్యమైంది. వాహనంతో పాటు పట్టుబడిన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కోల్‌ముంతల్‌పహాడ్ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్‌కు చెందిన పిట్ల రాజును విచారించగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన మున్నాకు సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. ఈ కేసులో మున్నాతో పాటు బాపూజీనగర్‌కు చెందిన అలకుంట దుర్గయ్య, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం లక్ష్మీపురానికి చెందిన ఓర్సు శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాహనాన్ని, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు.


