చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని రైస్‌మిల్లులు, ఇతర గోదాములకు ఎగుమతి చేసేందుకు అవవసరమైన లారీల కోసం అధికారులు శని వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల అధికారులు సంయుక్తంగా డ్రైవ్ చేపట్టారు. ఎనిమిది లారీలను స్వాధీనం చేసుకొని పలు గ్రామాలకు పంపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీరా భాయి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గుత్త వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ప్రణీత్‌రెడ్డి పాల్గొన్నారు.


