మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

ఆలేరురూరల్‌: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆలేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం, జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌, మండల మహిళా సమాఖ్య భవనాన్ని.. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామెల్‌, నోముల వీరేశం ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి శనివారం ఆమె ప్రారభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మహాలక్ష్మి పథకం అమలు చేసి ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు.మహిళ సంఘాలకు రూ.1250 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశామన్నారు. జిల్లాలోని 621 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ ద్వారా 58,58,25,000 రుణాల చెక్కును అందించామని చెప్పారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అన్ని పథకాలను మహిళల పేరున అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బీజనీ బాలమణి, వైస్‌ చైర్మన్‌ అంగడి ఆంజనేయులు, నీలం పద్మ, ఐనాల చైతన్య, కౌన్సిలర్లు, జూకంటి సంపత్‌, మల్లెల సరితశ్రీకాంత్‌, ఆంజనేయులు, నాయకులు అశోక్‌, కె.సాగర్‌రెడ్డి, నవీన్‌, సురేష్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

యాదగిరిగుట్ట: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వద్దిగళ్ల రాము నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని, పాత గుండ్లపల్లిలో మహిళా సమాఖ్య గ్రూప్‌ సహకారంతో ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన తరగతి గదిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కలలను ఇందిరమ్మ పథకం పేరుతో సీఎం నిజం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, మహిళా కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ రమ్య, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మ, పట్టణ అధ్యక్షుడు ముక్కెర్ల మల్లేష్‌యాదవ్‌ పాల్గొన్నారు.

ఫ పంచాయతీరాజ్‌శాఖ సీతక్క

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement