చౌటుప్పల్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు | - | Sakshi
Sakshi News home page

చౌటుప్పల్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయశాఖ సెక్రటరీ బి.పాపిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు న్యాయస్థానం కోసం కొంతకాలంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటం ఫలించడంతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాడూరు పరమేష్‌ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తాడూరు పరమేష్‌ మాట్లాడుతూ అదనపు కోర్టు ఏర్పాటుతో కక్షిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈమేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి పడమటి మహిపాల్‌రెడ్డి, సహాయ కార్యదర్శి మక్కా నర్సింహ, లైబ్రరీ సెక్రటరీ దేశగోని శ్రీశైలం, సభ్యులు నకిరేకంటి జ్యోతి, ఎండి.ఖయ్యూం, మాజీ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్‌గౌడ్‌, బాల్యం వెంకటాచలపతి, న్యాయవాదులు భిక్షపతి, బడుగు శ్రీకాంత్‌, జక్కర్తి శేఖర్‌, పిట్టల భరత్‌చంద్ర, చామట్ల జంగయ్య పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

యాదగిరిగుట్ట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.భిక్షపతి సూచించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంఆర్‌సీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, బుక్స్‌ పంపిణీ వివరాలను మండల విద్యాశాఖ అధికారిణి శరత్‌ యామినిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయాలన్నారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ ప్రతి రోజూ పూర్తి చేయాలని కోరారు.

రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌

సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్రం నిర్దేశించిన కోటాకు అనుగుణంగానే వరి, మొక్కజొన్న, జొన్నలు, పెసర్లు వంటి పంటలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానించడాన్ని తప్పుబట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌బీఆర్‌ఎస్‌ నాయకులు మొగుళ్ల శ్రీనివాస్‌, సుబ్బురు బీరుమల్లయ్య, జనగాం పాండు, ఏవీ కిరణ్‌కుమార్‌, కేశవపట్నం రమేష్‌, గాదే కవితానరేందర్‌రెడ్డి, చెన్న మహేష్‌, శెట్టిబాలయ్య యాదవ్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement