భువనగిరిటౌన్ : జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 17,344 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు వెల్లడించారు. శనివారం భువనగిరి కోర్టు ఆవరణలో లోక్‌అదాలత్ నిర్వహించారు. ఇందులో జూమ్ మీటింగ్ ద్వారా జడ్జి మాట్లాడారు. పరిష్కారమైన వాటిలో రెండు సివిల్ కేసులు, 2,064 క్రిమినల్ కేసులు, 15,278 ట్రాఫిక్ చలాన్ కేసులు, 42 ప్రీ–లిటిగేషన్ కేసులు ఉన్నట్లు వివరించారు. రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారం కావడానికి కృషి చేసిన జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, జిల్లా పోలీసు యంత్రాంగం, కోర్టు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ లోక్ అదాలత్‌లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీ లత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆరిఫ్, రెండవ తరగతి మెజిస్ట్రేట్ జ్యోతిరావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్.విద్యా సాగర్, కార్యదర్శి యాదగిరి, బాబురావు, ఎం. రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కె. కిషన్, జి. గోపాల్ రెడ్డి, జె. శివకిరణ్, జె. భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.


