నాన్నే నా బలం | - | Sakshi
Sakshi News home page

నాన్నే నా బలం

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

రంజీ ట్రోఫీలో రాణిస్తా

ప్రస్తుతం నేను సైనిక్‌పురిలోని భవాన్స్‌ వివేకానంద డిగ్రీ కాలేజీలో బీకామ్‌ సెకండియర్‌ చదువుతున్నా. చదువుతో పాటు క్రికెట్‌లో రాణించడానికి మా నాన్నగారి పూర్తి సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో రంజీ ట్రోఫీలో రాణించడంతో పాటు, జూలైలో జరిగే శ్రీలంక పర్యటనలో లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. భవిష్యత్తులో భారత సీనియర్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదగడమే నా లక్ష్యం.

– యశ్‌వీర్‌ గౌడ్‌

రాజాపేట : తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లో రాణిస్తున్నాడు రాజాపేటకు చెందిన యువకుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నా భవిష్యత్‌ కోసం తాపత్రయపడ్డారని, ఎంతో సహకారం అందించారని ఇండియా అండర్‌–19 జట్టుకు ఎంపికైన యశ్‌వీర్‌ గౌడ్‌ తెలిపారు. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా ఆయన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వగ్రామం రాజాపేట. మా నాన్న రాజ్‌కుమార్‌ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నా చిన్నతనం నుంచే మా బాబాయ్‌ దీపక్‌ కుమార్‌ ఆడే క్రికెట్‌ను చూసి దానిపై మక్కువ పెరిగింది. రోజూ బాబాయ్‌తో గల్లీలో ఆడుతూ క్రికెట్‌లో మెళకువలు నేర్చుకున్నా. నా ఆసక్తిని గమనించిన బాబాయ్‌ మా నాన్నను ఒప్పించి 8 ఏళ్ల వయసున్నప్పుడే హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లోని విద్యానగర్‌ డానియల్‌ అకాడమీలో చేర్పించారు. కోచ్‌ కమలేష్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందాను.

ఫీజు చెల్లించే స్థోమత లేకపోయినా..

ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో కొత్త క్యాంప్‌లో చేరాను. అక్కడ కృష్ణమోహన్‌, రవికుమార్‌ల ప్రోత్సాహంతో హైదరాబాద్‌ క్రికెట్‌ లీగ్‌లోకి అడుగుపెట్టాను. మా నాన్న ఉద్యోగం చేస్తూనే.. కెరీర్‌ కోసం ఉదయం, సాయంత్రం గ్రౌండ్స్‌ దగ్గరకు వచ్చి స్వయంగా పికప్‌ చేసుకునేవారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నా శ్రేయస్సు కోసమే తాపత్రయపడ్డారు. ఒకానొక సందర్భంలో లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు ఫీజు చెల్లించే స్థోమత లేక ఇబ్బంది పడగా, మా నాన్న, బాబాయ్‌ ఇద్దరూ కలిసి కోచ్‌ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించారు.

ఆల్‌రౌండర్‌గా..

లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా వరుసగా అండర్‌–16, అండర్‌–19 వన్డే ట్రోఫీలకు హైదరాబాద్‌ జట్టు తరఫున ఎంపికయ్యాను. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా, టాప్‌ స్పిన్నర్‌గా నిలిచాను. జట్టు విజయంలో కీలకమైన ఆల్‌రౌండర్‌గా నైపుణ్యాన్ని ప్రదర్శించా. ఇటీవల బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన ఆల్‌రౌండర్ల ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొన్నా. ప్రస్తుతం ఇండియా అండర్‌–19 జట్టు నుంచి పిలుపు లభించింది.

ఫ చిన్నతనం నుంచే క్రికెట్‌పై

మక్కువ పెరిగింది

ఫ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా

నాన్న వెన్నంటే ఉండి ప్రోత్సహించారు

ఫ భారత సీనియర్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదగడమే నా లక్ష్యం

ఫ ఇండియా అండర్‌–19 జట్టుకు

ఎంపికై న యశ్‌వీర్‌ గౌడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement