సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి | - | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

చిట్యాల: జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడంతో పాటుగా సొంత గ్రామమైన ఉరుమడ్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం, గ్రంథాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సొంత ఊరికి సేవ చేస్తే కన్నతల్లికి సేవ చేసిన తృప్తి కలుగుతుందన్నారు. ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి, చిట్యాల మండల స్పెషల్‌ ఆఫీసర్‌ వినోద్‌కుమార్‌, ఎంపీడీఓ మనోహార్‌, సర్పంచ్‌ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్‌ ఉయ్యాల నరేష్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ నర్రా వినోదమోహన్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ కోనేటి యాదగిరి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ, వెంకటేశ్వర్లు, గుత్తా వెంకట్‌రాంరెడ్డి, పల్లపు బుద్దుడు తదితరులు పాల్గొన్నారు.

ఫ శాసన మండలి చైర్మన్‌

గుత్తా సుఖేందర్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement