బుద్ధవనంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌లో శనివారం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, పర్యాటక శాఖ చీఫ్‌ సెక్రెటరీ వాణీప్రసాద్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని సోమశిల, కాకతీయ, భద్రాచలం, నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌, బుద్ధవనంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో హుజూర్‌నగర్‌కు చెందిన మహిళా డప్పు కళాకారులు తమ ప్రదర్శనలతో సందడి చేశారు. తెలంగాణ జానపద కళారూపాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement