మరో పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి | - | Sakshi
Sakshi News home page

మరో పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

భువనగిరి: భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితారెడ్డి మరో పర్వతాన్ని అధి రోహించారు. ఉత్తర అమెరికాలోని సుమారు 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలి పర్వతాన్ని శుక్రవారం అధిరోహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆమె సెవెన్‌ సమిట్స్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఈ పర్వతాన్ని అధిరోహించడంతో 6వ మైలు రాయిని దాటారు. ఎలైట్‌ జాబితాలో చేరేందుకు మరో అడుగు దూరంలో ఉన్నారు. 7వ తేదీన పర్వాతరోహణ చేయడం ప్రారంభించిన ఆమె అర్జెంటినాకు చెందిన పర్వతారోహకురాలు రేనాటతో కలిసి పర్వతాన్ని అధిరోహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement