బొమ్మలరామారం : కస్తూరిబా గాంధీ విద్యాలయంలో జరుగుతున్న సివిల్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి ఆదేశించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామంలో కస్తూరిబా గాంధీ విద్యాలయంతోపాటు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ను శుక్రవారం తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. కేజీబీవీలో జరుగుతున్న నాబార్డ్ అభివృద్ధి పనులను పరిశీలించి ఎస్‌ఓకు పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీలోని స్టోర్ రూమ్‌ను సందర్శించి కిచెన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సరుకులను జాగ్రత్తగా స్టోర్ చేయాలని సూచించారు. ఆయనవెంట ఎస్‌ఓ సాయిలక్ష్మి, ఉపాధ్యాయులు ఉన్నారు.


