పూర్తయిన మ్యాపింగ్
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవడానికి, ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి ఎన్నికల కమిషన్ ఈసారి ఆన్‌లైన్ ద్వారా సులువైన అవకాశాన్ని కల్పించింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే లోపే, ఓటర్లు స్వయంగా డిజిటల్ విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. బీఎల్‌ఓ ఇంటికి వచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను సమర్పిస్తే చాలు.
25 నుంచే ఆన్‌లైన్‌లో ..
ఎన్యుమరేషన్ ఫారాలు, ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా ముద్రించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో సైతం ఈ తేదీల్లోనే సైట్ అందుబాటులో ఉంటుంది. సర్‌ప్రక్రియలో భాగంగా భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలోని 566 పోలింగ్ బూత్‌లలో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర ఓటరు నమోదు చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో ఫాం సమర్పించడం ఇలా..
మొదటి దశ : మొదటగా https://voters.eci. gov.in వెబ్‌పోర్టల్, ఈసీఐనెట్ మొబైల్ యాప్‌లో వివరాలు సమర్పించి రిజిస్టర్ చేసుకోవాలి. ఇంతకు ముందే రిజిస్టర్ ఉంటే ఆ వివరాలతో లాగిన్‌కావాలి.
● రెండో దశ : యూజర్ డ్యాష్ బోర్డులో ఉండే ‘ఫిల్ ఎన్యుమరేషన్ ఫాం’అనే బటన్‌పై మొదట క్లిక్ చేయాలి. తర్వాత డ్రాప్ డౌన్‌లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం ఎంపిక చేసుకుని వివరాలను సమర్పించాలి.
● మూడో దశ : ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్‌ను (ఎపిక్ నంబర్) నమోదు చేసిన తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, వివరాలతో కూడిన ఎన్యుమరేషన్ ఫాం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
● నాలుగో దశ : ‘సెండ్ ఓటీపీ’పై క్లిక్ చేస్తే మీ ఓటరు ఐడీతో లింకై న మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే ఎన్యుమరేషన్ ఫాంలోని మిగతా భాగాలు అన్నీ అన్‌లాక్ అవుతాయి.
● ఐదవ దశ : 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితాతో మీ పేరు మ్యాపింగ్ చేసుకోవడానికి మొత్తం మూడు కేటగిరీలు ఉంటాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. 2002 నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే దాన్ని మ్యాపింగ్ చేయాలి. మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాన్నమ్మల పేర్లు ఉంటే వారి పేర్లతో మ్యాపింగ్ చేసుకోవాలి. మీ వద్ద 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితా వివరాలు అందుబాటులో లేకపోతే ఓటర్ పోర్టల్ డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్‌లాస్ట్ సర్’ టూల్‌ని ఉపయోగించి వెతకవచ్చు.
● ఆరోదశ : 5వ దశలో ఎంపిక చేసుకున్న కేటగిరీ ఆధారంగా ఎన్యుమరేషన్‌న్‌ఫాంలో నిర్ధేశిత వివరాలు నింపాలి. 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల పేర్లు ఉంటే ఆ వివరాలు, వారితో సంబంధం ఏంటి? అనేది దీనిలో నమోదు చేయాలి. ఒకవేళ నియోజకవర్గం మారితే పాత నియోజకవర్గం లేదా పార్ట్ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఓటరు పుట్టిన తేదీని కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. తాజా పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోను కూడా అప్‌లోడ్ చేయాలి.
● ఏడో దశ : ఎన్యుమరేషన్‌న్‌ఫాం మొత్తం నింపేసిన తర్వాత తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి. అన్నీ సరిగా ఉంటే డిక్లరేషన్ చెక్‌బాక్స్‌ను క్లిక్ చేసి చివరిగా సబ్‌మిట్ చేయాలి. అనంతరం ఈ పోర్టల్ నుంచి ఆధార్ ఈసైన్ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ మీ ఆధార్ నంబరు నమోదు చేసిన తర్వాత ఆధార్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబరును ఓటీపీతో ధ్రువీకరించుకోవాలి. ఇక్కడితో డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తవుతుంది.
ఎపిక్ ఐడీ, మొబైల్ నంబర్‌తో
లింక్ తప్పనిసరి
ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫాం సమర్పించేందుకు ఓటరు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎపిక్ (ఓటరు గుర్తింపు) ఐడీతో లింకై ఉండాలి. ఓటరు ఐడీ, ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరిపోవాలి. పేరులో స్పెల్లింగ్ తేడాలు ఉంటే డిజిటల్ ఈ–సైన్స్ ప్రక్రియ విఫలమయ్యే అవకాశం ఉంటుంది.
ఫ తెలుగులోనూ ఎన్యుమరేషన్ ఫారాలు
ఫ వివరాలు, ఫొటో అప్‌లోడ్‌కు అవకాశం
ఫ జిల్లాలో ఈ నెల 25నుంచి ఇంటింటి గణన
సర్‌లో బీఎల్‌ఓలు చేసిన ఓటరు మ్యాపింగ్ వివరాలు..
నియోజకవర్గం మొత్తం మ్యాపింగ్ మ్యాపింగ్
ఓటర్లు అయిన ఓట్లు, కాని ఓట్లు
భువనగిరి 2,21,903 1,89,598 32,305
ఆలేరు 2,38040 21,2338 25702
భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 4,59,943 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 4,01,936 (87.39 శాతం) మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి అయ్యింది. ఇంకా భువనగరి, ఆలేరు నియోజకర్గాల్లో 100237 మంది ఓట్లు తప్పులతడకగా ఉన్నాయి. తాజా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 25నుంచి ఓటర్ల ఎన్యుమరేషన్‌తో నూతన ఫొటో ఓటరు జాబితాలను తయారు చేస్తారు.


