నేడు మహిళా శిశు వికాస కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు మహిళా శిశు వికాస కేంద్రం ప్రారంభం

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

ఆలేరురూరల్‌ : ఆలేరు మండల కేంద్రానికి మంత్రి సీతక్క శనివారం రానున్నారు. ఆలేరు పట్టణంలో రూ.50 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని (మహిళా ప్రాంగణం) ఆమె ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలేరు ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు యాదగిరి

క్షేత్రానికి మంత్రి సీతక్క రాక

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం రానున్నారు. యాదగిరీశుడిని మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణం, మండలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాణిభరత్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ ముక్కెర్ల మల్లేష్‌ యాదవ్‌ శుక్రవారం వెల్లడించారు.

అమృత్‌ పనుల పరిశీలన

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో అమృత్‌ 2.0 పథకంలో భాగంగా నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌లను నాణ్యతతో నిర్మించాలని పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని అంగడీ బజార్‌లో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ను శుక్రవారం డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజనీర్‌ బి.మనోహర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట సహా యక కార్యనిర్వాహక ఇంజనీర్‌ పి.లోకేష్‌, కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ ఉన్నారు.

నేడు రెండో జాతీయ లోక్‌ అదాలత్‌

భువనగిరిటౌన్‌ : జిల్లావ్యాప్తంగా శనివారం రెండో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు, సంస్థ కార్యదర్శి వి.మాధవిలత సంయుక్త ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో ఈ లోక్‌ అదాలత్‌ జరుగుతుందని వెల్లడించారు. ఉభయ పక్షాలు రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్‌ కేసులు, సివిల్‌ దావాలు, ఎకై ్సజ్‌ కేసులు, బ్యాంకు బకాయిలు, టెలిఫోన్‌ బకాయిలు, ట్రాఫిక్‌ చలానా కేసులు, ఫైనాన్స్‌ కంపెనీల లావాదేవీలకు సంబంధించిన పెండింగ్‌, ప్రి లిటిగేషన్‌ (కోర్టుకు రాకముందు ఉన్న) కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ బకాయిలకు..

చౌటుప్పల్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌, దేవరకొండ, నల్లగొండ కోర్టుల పరిధిలో గల వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెల్లించాల్సిన బకాయి సమస్యలను శనివారం జరిగే లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ పి.వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు అకౌంట్స్‌ ఆఫీసర్‌ పి.ప్రసాద్‌ 9494443696, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ కరుణానాయక్‌ 9492868180, నాగరాజు 9441000163 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

‘సర్‌’ ను పకడ్బందీగానిర్వహించండి

సాక్షి,యాదాద్రి : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహణ, పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, బూత్‌ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ వీసీలో భువనగిరి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు కృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement