మునుగోడు: వారం రోజుల క్రితం పెద్దఎత్తున వచ్చిన గాలివానతో మునుగోడు మండలం పలివెల గ్రామ శివారులోని చీకటిమామిడి రోడ్డులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడింది. స్తంభానికి నేటికీ మరమ్మతులు చేయకపోవడంతో ఆ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపొయింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా నడిచే దాదాపు 20 మంది రైతుల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కావడం లేదు. వ్యవసాయ బావుల వద్ద ఉండే మూగ జీవాలకు అవసరమైన నీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఇప్పటికై యినా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని విరిగి పడినా విద్యుత్ స్తంభాని సరిచేసి ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ చేయాలని కోరుతున్నారు.


