● రైతులు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించడం వలన వారి సిబిల్ స్కోరు మెరుగుపడుతుంది. పెద్ద రుణాలు పొందవచ్చు.
● భవిష్యత్‌లో పంట రుణాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ పరికరాల కొనుగోలుకు కూడా ఈ యాప్ ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
పెద్దవూర: నూతనంగా పంట రుణాలు పొందాలనుకునే రైతులు ఇకనుంచి బ్యాంకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ నుంచే నేరుగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చింది. ఇప్పటివరకు సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పంట రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు రేపు, మాపు అంటూ తిప్పించుకునేవారు. ఇక నుంచి పంట రుణాలు కావాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం మొబైల్ యాప్ ద్వారా నేరుగా పంట రుణాల కసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘కృషికా’ అనే నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లిష్‌లో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని అధికారులు వెల్లడించారు.
యాప్
పనిచేసే విధానం..
● అన్నదాతలు ముందుగా తమ మొబైల్ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి కృషికా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
● ఆధార్ నంబర్, రైతు పూర్తి పేరు, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్ నమోదు చేయాలి. దీంతో పాన్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్ వివరాలు కనిపిస్తాయి.
● బ్యాంకు వివరాలను నమోదు చేసి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమాచారం సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌కి చేరుతుంది. బ్యాంకు అధికారులు వివరాలను పరిశీలించి రైతుకు రుణం మంజూరు చేస్తారు.
ప్రయోజనాలు ఇవే..
● రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో రైతులకు సమయం, ఖర్చులు ఆదా అవుతాయి.
● తమ దరఖాస్తు ఏ దశలో ఉందో కృషికా యాప్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. అవినీతికి ఆస్కారం ఉండదు.
● పంటల సాగు ప్రారంభ సమయంలోనే రుణం లభించడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
● రుణం పేరిట దళారుల బారినపడకుండా ఈ యాప్ నిరోధిస్తుంది.
ఫ అన్నదాతలకు అండగా ‘కృషికా’ యాప్
ఫ బ్యాంకులకు వెళ్లకుండా
రుణం పొందే అవకాశం


