మిర్యాలగూడ అర్బన్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన గుర్తు తెలియని యువకుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 5న మిర్యాలగూడలో డెమో ట్రైన్ ఎక్కిన యువకుడు బీబీనగర్ ఘట్కేసర్ సమీపంలోకి చేరుకున్న సమయంలో రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో గుర్తించి రైల్వే పోలీసులు క్షతగాత్రుడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన సదరు యువకుడికి చికిత్స అందింస్తున్నారు. అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బుధవారం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, సదరు యువకుడిని గుర్తించిన 9848222169, 9182234467 నంబర్లను సంప్రదించాలని వైద్యులు తెలిపారు. సదరు యువకుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని, అతడి ఎడమ చేతిపై రోజా, ఎడమ చాతిపై సిద్ధు, కుడి చేతిపై ఆయుషు అని రాసి ఉందని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన చెరబహదూర్(47) చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ పరిధిలోని శ్రీ పైప్స్ ఇన్‌ఫ్రా కంపెనీలో గత కొంతకాలంగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న కూరగాయలు కొనుగోలు చేసేందుకుగాను బైక్‌పై వెలిమినేడు గ్రామానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి పిట్టంపల్లి శివారులో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు అంబహదూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


