వచ్చేస్తోంది ఆభా | - | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోంది ఆభా

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ విధానం అమలు

భువనగిరి: ఇక నుంచి ఆస్పత్రికి వెళ్తే పాత ప్రిస్క్రిప్షన్లు, మెడికల్‌ రిపోర్టులు తీసుకెళ్లాల్సిన పనిలేదు. రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య చిట్టా, గతంలో జరిగిన సర్జరీలు, ఇతర పరీక్షల వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో డాక్టర్‌కు ఆన్‌లైన్‌లో కనిపించనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ (ఆభా) విధానానికి యాదాద్రి భువనగిరి జిల్లా పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికై ంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ డిజిటల్‌ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది.

ప్రత్యేక కమిటీల ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా 327 ప్రైవేట్‌ ఆస్పత్రులు, ప్రభుత్వ జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఒకటి, సీహెచ్‌సీలు 3, పీహెచ్‌సీలు 21, సబ్‌ సెంటర్లు 71, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లు 105 ఉన్నాయి. వీటన్నింటిలో ఆభా అమలుకు ప్రత్యేకంగా కమిటీలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లగానే మొదట ఔట్‌ పెషెంట్‌ విభాగంలో రోగుల ఆధార్‌ కార్డుతో ఆభాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రోగి ఆరోగ్య వివరాలన్నీ నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు, బ్లడ్‌ గ్రూప్‌తో పాటు ఆపరేషన్‌ వివరాలు రోగి ఆరోగ్య రికార్డులోనమోదుకానున్నాయి. ఆభాలో రిజిస్ట్రేషన్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్కో రోగికి రూ. 20 చొప్పున ఆస్పత్రికి చెల్లించనుంది.

మూడు విధాలుగా..

ఆభా కార్యక్రమం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానాన్ని మూడు విధాలుగా కొనసాగిస్తున్నారు. ఇందులో మొదటగా ఆస్పత్రులు, రెండో దశలో వైద్యులు, నర్సులు, మూడో విడతలో డ్రగ్గిస్ట్‌లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనంతరం ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఆభా సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ రంగంలో 201కిగాను 177 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు హెల్త్‌ ఫెసిలిటీ రిజిస్ట్రీ(హెచ్‌ఎఫ్‌ఆర్‌)లో నమోదు చేసుకోగా ఇంకా 24 పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్‌ ప్రొఫెషనర్‌ రిజిస్ట్రీ(హెచ్‌పీఆర్‌)లో 222 మంది వైద్యులకు 198 మంది నమోదు చేసుకోగా 24 మందివి పెండింగ్‌లో ఉన్నాయి. 180 స్టాఫ్‌ నర్సుల్లో 157 మంది నమోదు చేసుకోగా ఇంకా 23 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 28 ఫార్మసిస్టుల్లో 14 మంది నమోదు చేసుకోగా ఇంకా 14 మంది చేసుకోవాల్సి ఉంది. అలాగే 219 ఏఎన్‌ఎంలకు 213 మంది నమోదు చేసుకున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లీనిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబొరేటరీలు కలిపి మొత్తం 327 ఉన్నాయి. ఇందులో 168 హెచ్‌ఎఫ్‌ఆర్‌లో నమోదు కాగా 169 చేసుకోవాల్సి ఉంది. 713 మెడికల్‌ షాపులకుగాను హెచ్‌ఎఫ్‌ఆర్‌లో 214 నమోదుఅయ్యాయి.289 మంది వైద్యులకుగాను 9 మంది, 9,415 మంది స్టాఫ్‌ నర్సులకు ముగ్గురు మాత్రమే నమోదు చేసుకున్నారు.

ఫ పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక

ఫ రోగుల ఆరోగ్య వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే

ఫ ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి

ఫ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నూతన పద్ధతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement