పింఛన్‌ ఇప్పించండి సారూ.. | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇప్పించండి సారూ..

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

సేంద్రియ వ్యవసాయం చేపట్టాలి
రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు.
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

- 8లో

ఐదేళ్లుగా అధికారుల చుట్టూ అంధుడి ప్రదక్షిణలు

ఆసరా కోసం ఎదురుచూస్తున్న రాజాపేట వాసి చెన్నయ్య

రాజాపేట: ఆయన కంటిచూపు కోల్పోయి ఐదేళ్లయింది.. ఆపన్నహస్తం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఓ వైపు అంధత్వం, మరోవైపు పేదరికం వెంటాడుతుండటంతో ఆ వృద్ధుడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రాజాపేటకు చెందిన పిట్టల చెన్నయ్య (56)కు భార్య పోచమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. అయితే, వీరి పెద్ద కుమారుడు వివాహమయ్యాక బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లాడు. చిన్న కుమారుడు కొన్నేళ్ల క్రితం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు కూడా చేశారు. ఐదేళ్ల క్రితం చెన్నయ్య అకస్మాత్తుగా కంటిచూపు కోల్పోయాడు. దీంతో భార్య పోచమ్మ ఇళ్లల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. వీరికి చిన్న ఇల్లు తప్ప ఎలాంటి భూమి, ఆస్తులు లేవు. ప్రభుత్వం నుంచి వికలాంగుల పింఛన్‌ వస్తే తమ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉంటుందని చెన్నయ్య ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. దరఖాస్తులు ఇస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి పింఛన్‌ ఇప్పించాలని చెన్నయ్య కోరుతున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement