దరఖాస్తు గడువు 22వరకు పొడిగింపు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్స్(బైపీసీ,ఎంపీసీ)లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంవత్సరానికి రూ,7,800, జనరల్, ఓబీసీ విద్యార్థులకు రూ. 12,600 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఖాళీల భర్తీలో మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపార వేత్తల పిల్లలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.


