పెళ్లింట్లో తీవ్ర విషాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట్లో తీవ్ర విషాదం

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

చిలుకూరు : తెల్లారితే కుమారుడి పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇంట్లో ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి మృతిచెందింది. ఈ ఘటన చిలుకూరు మండలం దూదియాతండా గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దూదియాతండాకు చెందిన చెందిన బాణోతు చిన్నానాయక్‌, లింగమ్మ(51) దంపతుల పెద్ద కుమారుడు సాయికిరణ్‌ పెళ్లి శనివారం ఉదయం జరగాల్సి ఉంది. శుక్రవారం సాయికిరణ్‌ను పెళ్లి కొడుకును చేసేందుకు ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం లింగమ్మ వంట గదిలో ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఆమె భర్త చిన్నానాయక్‌ గమనించి లింగమ్మ చేతిని పట్టుకొని లాగే ప్రయత్నం చేయగా.. అతడు కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే చిన్నానాయక్‌ తన చేతి వెనక్కి లాక్కోని విద్యుత్‌ మెయిన్‌ను ఆపేశాడు. దీంతో లింగమ్మ కిందపడిపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి సీపీఆర్‌ చేసినప్పటికీ మృతిచెందింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హనుమాన్‌నాయక్‌ తెలిపారు. ఈ ఘటనతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. లింగమ్మ ఆశ వర్కర్‌గా పనిచేస్తుంది.

ఫ తెల్లారితే కుమారుడి వివాహం

ఫ ఇంట్లో ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి మృతి

ఫ చిలుకూరు మండలం

దూదియాతండాలో ఘటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement