వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

వలిగొండ : వలిగొండ మండలంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారును వలిగొండ మండలం ముద్దాపురం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న యాకుబ్‌, భార్గవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడికి చెందిన మచ్చ ముత్యాలు, మచ్చ సత్తమ్మ, మచ్చ రామచంద్రు, మచ్చ కోటమ్మ ఆటోలో వలిగొండ మండలం సుంకిశాలలో శుభాకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా.. టేకులసోమారం సమీపంలో ఎదురుగా వచ్చిన మరో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

తుర్కపల్లి : అక్రమంగా 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం తరలిస్తున్న డీసీఎంను గురువారం తుర్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆలేరు మండలం కందిగడ్డతండాకు చెందిన కేతావత్‌ ప్రభాస్‌, బానోత్‌ శివఆలేరు పరిసర ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి గజ్వేల్‌, సిద్దిపేట వైపు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. డీసీఎంతో పాటు పట్టుబడిన బియ్యాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తఖియొద్దీన్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement