నల్లగొండ టూటౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని యువత వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఎంజీయూలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం, తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ టీ–శాట్ ఆధ్వద్వర్యంలో ఆన్‌లైన్ తరగతులు, సర్టిఫికెట్ కోర్సుల ప్రారంభానికి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అందిస్తున్న విద్యా అవకాశాలు మరింత ఉపయోగకరంగా, విస్తృతంగా విద్యార్థులకు అందుతాయన్నారు. భవిష్యత్తులో కోర్సుల పరిధి మరింత పెంచి ఇతర విభాగాలు కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీ–శాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, సాధిక్, లింగారెడ్డి, అలవాల రవి, ఆకుల రవి పాల్గొన్నారు.
ఫ ఎంజీయూ వైస్ చాన్స్‌లర్
ఖాజా అల్తాఫ్ హుస్సేన్


