ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

రామగిరి(నల్లగొండ ): ఆర్టీసీ సంస్థ రిటైర్డ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉమ్మడి ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం నల్లగొండలోని రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌ఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఉద్యోగులు మాట్లాడుతూ 2013 పీఆర్‌సీ ప్రకారం యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను వెంటనే పీఎఫ్‌ కమిషనర్‌ ఆఫీసుకు పంపించాలన్నారు. 2017 పీఆర్‌సీ బకాయిలను 9 సంవత్సరాలుగా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో తమ కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణం కల్పించాలని, హైదరాబాద్‌లోని తార్నాక ఆస్పత్రిలో పాత పద్ధతిలోనే ఒకేసారి రెండు నెలలకు సరిపడా మెడిసిన్‌ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భోనగిరి శంకరయ్య, రీజినల్‌ అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల యాదగిరి, పల్‌రెడ్డి యాదగిరిరెడ్డి, బొమ్మ మల్లయ్య, శ్రీను, వీఎస్‌పీ.రావు, వీవీ.రెడ్డి, వీఏ.రెడ్డి, రవీందర్‌, ఎస్‌ఆర్‌రెడ్డి, ఎండీ.గౌస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement