మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

గుండాల : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం రూ.49 లక్షలతో ఏర్పాటు చేసిన పప్పు ప్రాసెసింగ్‌ ఆహార ధాన్యం నిల్వల గోదాముకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రజా ప్రభుత్వం సోలార్‌ ప్రాజెక్టు, పెట్రోల్‌ బంక్‌లలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు జాతీయ ఆహార భద్రత పథకం ఆధ్వర్యంలో కందుల సంచులు అందించారు. మరిపడిగకు చెందిన బండారు యాదలక్ష్మికి కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ చేశారు. అనంతరం బూర్జుబావి గ్రామంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు వల్లాల వాసవి, రమేష్‌ ఇంటిని ప్రారంభించారు. గ్రామంలో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మోత్కూరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల భిక్షంగౌడ్‌, సర్పంచ్‌లు దేవనబోయిన అయిలయ్య, వల్లాల రమేష్‌, లింగాల అనిల్‌కుమార్‌, కాలి మంజూల, మద్దెపురం కొండమ్మ, తహసీల్దార్‌ ఎస్‌.హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, ఏఓ సూరజ్‌కుమార్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు ఇమ్మడి దశరథ గుప్తా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement