భువనగిరి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులిస్తోందన్నారు. ఇప్పటి వరకు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల రూపంలో ఇచ్చిందన్నారు. ఇందులో ఎయిమ్స్ నిర్వహణకు ఏడాదికి రూ.500 కోట్లు, రోడ్లకు రూ.36వేల కోట్లు, చర్లపల్లి నుంచి యాదాద్రి వరకు వేసే ఎంఎంటీఎస్‌కు రూ.600 కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల మురళీధర్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, నాయకులు దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్, పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, చందా మహేందర్ గుప్తా, మాధురి, బలరాం, రాచకొండ కృష్ణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్


