మంటలంటుకుని కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మంటలంటుకుని కారు దగ్ధం

Jun 18 2026 1:59 AM | Updated on Jun 18 2026 1:59 AM

చివ్వెంల(సూర్యాపేట) : మంటలంటుకుని రహదారిపై కారు దగ్ధమైంది. ఈ ఘటన చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్‌ గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్బిలేడు గ్రామానికి చెందిన బత్తుల వెంకటనారాయణ తన కారులో సూర్యాపేటకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. మార్గమధ్యలో వట్టిఖమ్మంపహాడ్‌ గ్రామ శివారులోకి రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన ఆయన కారు దిగి దూరంగా వెళ్లాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సాంకేతిక లోపం వల్లే కారులో మంటలు వచ్చి ఉంటాయని పోలిసులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement