క్వింటా రూ.6వేల చొప్పున కొనుగోలు చేశా
సన్నబియ్యం ధరలు ఇలా..
(క్వింటాకు రూపాయల్లో..)
బియ్యం రకం పాత ధర కొత్త ధర
జేఎస్‌ఆర్ కొత్తవి 5,000 5,500
జేఎస్‌ఆర్ పాతవి 6,400 7,000
బీపీటీ కొత్తవి 4,200 5,200
పాత బీపీటీ 5,000 6,000
సంస్థాన్ నారాయణపురం : బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ కొనుగోళ్లు, బోనస్ ఎఫెక్ట్‌తో స్థానిక మార్కెట్లలో సన్న ధాన్యం దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాల నుంచి ధాన్యం తెప్పించి మర పట్టిస్తుండటంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సన్న రకాలపై వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు కనీసం రూ.800 నుంచి రూ.1000 వరకు పెరగడంతో సామాన్యులు బియ్యం కొనేందుకే జంకుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం దిగుమతి
స్థానికంగా సన్నధాన్యం లభ్యత తగ్గిపోవడంతో జిల్లాలోని ఆయకట్టు ప్రాంతాలతో పాటు మిర్యాలగూడ, హాలియా, నాగార్జునసాగర్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి స్థానిక మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. స్థానిక మార్కెట్‌లో ధాన్యం కొరత తీవ్రంగా ఉండడంతో ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందని మిల్లర్లు చెబుతున్నారు.
బియ్యం వ్యాపారం ఎలా ఉందంటే..
జిల్లాలో సుమారు 70 రైస్‌మిల్లులు ఉండగా దాదాపు 600 బియ్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు అనేక కిరాణ దుకాణాల్లో కూడా బియ్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు పెరగడంతో రిటైల్ మార్కెట్‌లోనూ సన్నబియ్యం ధరలు పెరిగాయి. దీంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాలు అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరింత పెరిగే అవకాశం..
మార్కెట్‌లో సన్నధాన్యం నిల్వలు తక్కువగా ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం దిగుమతులపై ఆధారపడాల్సి రావడంతో సన్నబియ్యం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రైతులకు మాత్రం సన్నధాన్యానికి మద్దతు ధర లభిస్తుండడంతో ఈ పరిస్థితి వారికి లాభదాయకంగా మారింది.
వారం రోజుల్లోనే క్వింటా బియ్యంపై రూ.800 పెరుగుదల
ఫ మార్కెట్‌లో లభించని సన్న రకాల ధాన్యం
ఫ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
ఫ గత వానాకాలంలో ప్రభుత్వం సన్నాలు కొనడమే కారణం
నెల రోజుల క్రితం పాత బీపీటీ బియ్యం క్వింటా రూ.5,200 చొప్పున కొనుగోలు చేశాను. వారం రోజుల క్రితం అవే బియ్యం ధర రూ.6వేలకు చేరింది. రూ.1,500 ఇచ్చి 25 కేజీలు కొనుగోలు చేశాను. నెలలోనే బియ్యం ధర రూ.800 పెరగడం మధ్యతరగతి ప్రజలు భారంగా మారింది.
– శనిగల జంగయ్య, జనగాం


