పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

Jun 18 2026 1:59 AM | Updated on Jun 18 2026 1:59 AM

భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ అనురాగ్‌జయంతి ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిని కలెక్టర్‌ సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అంతకు ముందు ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్‌, శానిటేషన్‌, నవజాతశిశువు ప్రత్యేక రక్షణ, బాలింతలకు అందుతున్న సేవలు, టీ హబ్‌ సేవలు, ఆస్పత్రి ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌పేషెంట్‌, ఔట్‌పేషెంట్‌ వివరాలు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాను మోడల్‌ జిల్లాకు ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయుష్మాన్‌ భారత్‌హెల్త్‌ అకౌంట్‌లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణకుమారి, డాక్టర్‌ ఎ. జయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ మనోహర్‌ ఉన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement