కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు యాదాద్రి భువనగిరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆస్పత్రికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న వారు దేశంలో ఎక్కడైనా, ఏ ఆస్పత్రికి వెళ్లినా.. కేవలం మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే వారి ఆరోగ్య వివరాలు వైద్యులకు డిజిటల్‌గా అందుబాటులోకి వస్తాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా కేంద్ర ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, నేను సైతం అంటూ స్వయంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ రిజిస్టర్ చేసుకునే విధానాన్ని పరిశీలించారు.


