ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

ఆత్మకూరు(ఎం): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. పెంచిన ధరలను తగ్గించని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మండలంలోని రహీంఖాన్‌పేట వద్ద బస్సులు ఆపాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, మండల కార్యదర్శి మారుపాక వెంకటేశం, మండల సహాయ కార్యదర్శులు ఎండి నయీం. బత్తిని నరేష్‌, చేనేత సంఘం రాష్ట్ర నాయకులు పాశికంటి లక్ష్మినర్సయ్య, నాయకులు జల్థి రాములు, కల్వల నర్సయ్య, సోలిపురం లింగారెడ్డి, మారుపాక అంజయ్య, కూరెల్ల మత్స్యగిరి, గుర్రం రాజమణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement