ఆత్మకూరు(ఎం) : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాథ్, నాయకులు బండారు సత్యనారాయణ, లోడి వెంకటయ్య, సూర్య, వపన్ సాయి పాల్గొన్నారు.
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
బొమ్మలరామారం : వైద్య శిబిరాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఈగల సంతోష బాల్‌రాజ్ అన్నారు. మండలంలోని పెద్దపర్వతాపూర్‌లో సోమవారం ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ ఏయిమ్స్ సౌజన్యంతో సోమవారం ప్రత్యేక చాతి ఎక్స్‌రే శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సుమలత, సూపర్‌వైజర్ జనార్దన్, పంచాయితీ కార్యదర్శి వెంకటేష్, ఉప సర్పంచ్ జింక నరేందర్, గంగల దివ్య పాల్గొన్నారు.
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం
తుర్కపల్లి : కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సెంట్రింగ్ యూనియన్ మండల కన్వీనర్ తూటి వెంకటేశం అన్నారు. మండల కేంద్రంలో బీసీడబ్ల్యూసీ, సీఐటీ యూ పలుగుల మైసమ్మ తల్లి సెంట్రింగ్ యూనియన్ మండల కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో గందమల్ల అనంద్,జంగంపల్లి బాలరాజు,వెంకటేష్, రాజు, శ్రీశైలం, జడల లింగం, రాగుల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
విత్తనాలు, ఎరువుల దుకాణాలు తనిఖీ
గుండాల : మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో సోమవారం ఏవో సూరజ్‌కుమార్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్‌లో జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీలుగ 30 కిలోలు రూ.2482.50 పైసలు, జనుము రూ.3150 చెల్లించి రైతులు తీసుకోవాలని కోరారు.
కార్పొరేట్ కళాశాలలకు పది మంది ఎంపిక
మోత్కూరు : పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద, గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వం డీఆర్డీఏ పథకం ద్వారా కల్పిస్తున్న ఉచిత విద్య అవకాశాన్ని మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పది మంది విద్యార్థులు వివిధ ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరవిందరాయుడు సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థిని కొక్కుల ఉషశ్రీ ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ బాసరలో ప్రవేశం పొందిందన్నారు.
గౌడ యువజన విభాగం
మండల అధ్యక్షుడిగా గోవర్దన్ గౌడ్
మోత్కూరు : తెలంగాణ గౌడ యువజన విభాగం మోత్కూరు మండల అధ్యక్షుడి గా బుజిలాపురం గ్రామానికి చెందిన మొల్కపురి గోవర్దన్ గౌడ్‌ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షిప్త సమాచారం


