భువనగిరి : వయోవృద్ధులకు ఉచితంగా న్యాయ సే వలను అందించనున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికా ర సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. ప్రపంచ వృద్ధుల వేదింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని పురష్కరించుని సోమవారం రాయగిరిలోని సహృదయ వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వృద్ధులకు న్యాయ సేవలు అందించేలా చర్య తీసుకుంటామన్నారు. ఆమెవెంట ఆశ్రమ ఇన్‌చార్జ్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
పాలకమండలిని
నియమించాలి
రామన్నపేట : నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌కు పాలకమండలిని నియమించాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం కోరారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు అధునాతమైన పరికరాలను అందజేయాలన్నారు. వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న బార్బర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు రాపరి గణేష్, ఉపాధ్యక్షుడు దడిపెల్లి గణేష్, కోశాధికారి వావిళ ్లసంతోష్, వేముల అశోక్, రాసమల్ల శ్రీకాంత్, జంపాల మురళీ, వేముల దశరథ, డి.నాగరాజు, జంపాల నరేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


