ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తిచేయాలి

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

భువనగిరిటౌన్‌ : ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తిచేయాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమ్‌ అన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో సింగన్న గూడెం గల డబుల్‌ బెడ్‌ రూమ్‌లను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కరరావు తో కలసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల అమలు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగన్నగూడెం లోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ అలివేలు, భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రప్రకాశ్‌రెడ్డి, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

భువనగిరి : మండలంలోని అనంతారం గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్‌ ఎండీ ఎండీ గౌతమ్‌, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి యాజమానులతో మాట్లాడి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వారివెంట ఎంపీడీఓ దినకర్‌, సర్పంచ్‌ పల్లెపాటి నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement