ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు మా ఊరికి రావొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు మా ఊరికి రావొద్దు

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

ఆన్‌లైన్‌ ప్రక్రియ.. ప్రత్యేక ట్రాకింగ్‌ నంబర్‌

న్యూస్‌రీల్‌

వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
పండుగ వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం

- 8లో

మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2026

మండలస్థాయి అధికారులతో సమీక్షించడానికి ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్స్‌ వ్యవస్థ

ప్రజావాణి వినతుల ఆన్‌లైన్‌ ప్రక్రియకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌

భువనగిరిటౌన్‌ : ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యానికి చెక్‌ పెడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణికి వచ్చే అర్జీలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, దరఖాస్తుదారుల ముందే ‘వీడియో కాన్ఫరెన్స్‌’ ద్వారా క్షేత్రస్థాయి అధికారుతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. దీనికి తోడు అర్జీ ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ కౌంటర్లు, ప్రత్యేక ట్రాకింగ్‌ నంబర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకతను పెంచారు.

క్షేత్రస్థాయి అధికారులకు వివరించి..

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన వెంటనే క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అనుమతితో ప్రజావాణి సమయం ముగిసే వరకు జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరూ విధిగా వీడియో కాన్ఫరెన్స్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన వెంటనే, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నారు. బాధితుల ముందే సమస్యకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయి అధికారులకు వివరించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాలో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి,యాదాద్రి: బడి గంట మోగింది. పండుగ వాతావరణంలో పాఠశాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. మామిడితోరణాలు, అరటి ఆకులతో స్కూళ్లను ముస్తాబు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కానీ పుస్తకాల సంచి పట్టుకుని రావాల్సిన విద్యార్థులే కరువయ్యారు. జిల్లాలో ప్రారంభమైన నూతన విద్యాసంవత్సరానికి అమావాస్య సెంటిమెంట్‌ ఎఫెక్ట్‌ కన్పించింది. తొలిరోజు అంతంమాత్రమే హాజరు నమోదైంది. వచ్చిన విద్యార్థులకు చాక్లెట్లు, ఉచిత పుస్తకాలు ఇచ్చారు. అక్కడక్కడా పేరెంట్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి ఈ విద్యాసంవత్సరం ప్రణాళికపై చర్చించారు.

హాస్టళ్లలోనూ..

వేసవి సెలవుల తర్వాత రెండు రోజులు పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. శనివారం నాడే ప్రారంభకావాల్సిన పాఠశాలు ఎండ వేడిమి తగ్గకపోవవడంతో సోమవారం వరకుపొడిగించారు. అయితే తెరుచుకున్న పాఠశాలలకు తొలిరోజున విద్యార్థులు చాల స్వల్పంగా హాజరయ్యారు. కొన్ని చోట్ల ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకుహాజరు కాలేదు. మొత్తంగా జిల్లాలో 10 శాతం విద్యార్థులు వచ్చారు. మంగళవారం నుంచి విద్యార్థుల హాజరు సంఖ్య పెరగవచ్చని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కాగా వివిధ శాఖల వసతి గృహాల విద్యార్థులు ఇంకా ఇళ్లనుంచి రాలేదు. వసతి గృహాల్లో 2 శాతం మించి విద్యార్థులు హాజరుకాలేదు.

మూతబడిన స్కూళ్లు తెరుచుకునేనా..

జిల్లాలో గతంలో వివిధ కారణాలతో మూతపడిన 62 పాఠశాలలు తెరుచుకోలేదు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు చేరలేదు. 10 నుంచి 15 మంది విద్యార్థులు నమోదు అయితే బడులను తెరవడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

పేరెంట్స్‌ కమిటీ సమావేశాలు

తొలిరోజున పలు పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను ఉపాధ్యాయులు వివరించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను భోధించాలని ఉపాధ్యాయులను కోరారు.

ప్రజావాణిలో వచ్చే అర్జీలను ఆయా శాఖలకు వేగంగా చేరవేసేందుకు వీలుగా కలెక్టరేట్‌లో రెండు ప్రత్యేక ఆన్‌లైన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తులను స్వీకరించిన వెంటనే ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. అనంతరం సదరు అర్జీకి ఒక ప్రత్యేక ట్రాకింగ్‌ నంబర్‌ కేటాయించి బాధితులకు అందిస్తున్నారు. దీనివల్ల దరఖాస్తు ఏ దశలో ఉందో ప్రజలు సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఈ నూతన విధానం ద్వారా సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని జిల్లా యంత్రాంగం తెలిపింది.

కొండాపూర్‌లో పోషమ్మతో మాట్లాడుతున్న గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌, చిత్రంలో కలెక్టర్‌

ఫ పొడిచేడులో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు

ఫ అర్జీలు అందిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష

ఫ ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌తో పారదర్శకత

ఫ ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు

ఫ ప్రజావాణిలో నయా ట్రెండ్‌

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ప్రత్యేక చొరవ

ఫ అమావాస్య సెంటిమెంట్‌ ఎఫెక్ట్‌ .. తొలిరోజు హాజరు 10శాతమే

ఫ విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

ఫ మొదటిరోజే పాఠ్య పుస్తకాల పంపిణీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement