సాక్షి,యాదాద్రి : అర్హుడైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బూత్‌స్థాయి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చూడాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో భువనగిరి నియోజకవర్గ బూత్ స్థాయి ప్రతినిధులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై నిర్వహించిన శిక్షణలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని సచిన్ సావంత్ మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతి కుటుంబానికి సమాచారం చేరవేయాలని కోరారు.
ఫ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్


