ఫ రాఘవాపురం సర్పంచ్ వినూత్న ప్రచారం
ఆత్మకూరు(ఎం): ‘నా ఊరి బడిని నేను కాపాడుకుంటా’ అంటూ ఆత్మకూరు(ఎం) మండలం రాఘవాపురం గ్రామ సర్పంచ్ ఎర్కల యతీశ్వర్ గౌడ్ రూపొందించిన పోస్టర్ సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతోంది. మన గ్రామంలోని బడిలో పిల్లల్ని చేర్పిస్తే మంచి విద్యను అందించే బాధ్యత తీసుకుంటానని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే అయ్యే ఖర్చు, ప్రభుత్వ పాఠశాలకు పంపించిస్తే కలుగే ఆదా గురించి అందులో వివరించారు. ప్రతి 15 రోజులకు ఒక సారి తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతులను అందులో పేర్కొన్నారు.


