అక్షరాల బాటకు పయనం | - | Sakshi
Sakshi News home page

అక్షరాల బాటకు పయనం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

జిల్లాలో విద్యార్థుల వివరాలు

భువనగిరి: వేసవి సెలవులు ముగిసాయి. 45 రోజుల తర్వాత తిరిగి పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు వాటికి స్వప్తి చెప్పి బడిబాట పట్టనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను అకర్షించేలా రంగురంగుల కాగితాలు, మామిడి తోరణాలతో పాఠశాలలను ముస్తాబు చేశారు.

తొలిరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ

పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను అందజేయనున్నారు. వేసవి సెలవుల్లో జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను స్థానిక దివ్య బాల విద్యాయంలోని గౌడాన్‌లో నిల్వ ఉంచి అక్కడి నుంచి మండల ఎంఆర్సీ కేంద్రాలకు సరఫరా చేసి అక్కడి నుంచి పాఠశాలలకు చేర్చారు. మొదటి రోజు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలల ప్రగతి, బడిబాట ద్వారా విద్యార్థులు బడిలో చేర్చటం వంటి అంశాల మీద చర్చించనన్నారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను సన్మానించనున్నారు.

మూతబడిన పాఠశాలలను

తెరిపించేందుకు

జిల్లాలో మూతబడిన 66 పాఠశాలలను తిరిగి తెరిపించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఎంఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మూతబడిన పాఠశాలలో కనీసం 10 నుంచి 15 మంది విద్యార్థులను చేర్పించేలా ప్రణాళికను రూపొందించారు.

ఫ ముగిసిన వేసవి సెలవులు

ఫ నేటి నుంచి పునఃప్రారంభం కానున్న పాఠశాలలు

ఫ తొలిరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ

పాఠశాలలు విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలు 31 4,725

ప్రాథమిక, జెడ్పీహెచ్‌ఎస్‌ 630 34,475

కేజీబీవీ 11 2,856

యూఆర్‌ఎస్‌ 01 49

టీఎస్‌ఎంఎస్‌ 07 3,947

టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ 4 2,227

టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 7 3,885

టీఎస్‌ టీడబ్ల్యూఆర్‌ఐఈఎస్‌ 1 319

ఎంజేపీటీబీ 5 2,356

టీఎంఆర్‌ఐఈఎస్‌ 3 968

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement